![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -197 లో.. రాజ్ , కావ్యల గదిలోకి పాల గ్లాస్, పూలతో రెడీ అయి కావ్య వస్తుంది. తనని అలా చూసిన రాజ్.. ఎందుకు ఇలా రెడీ అయి వచ్చావని అడుగుతాడు. నేనేం రాలేదు అమ్మమ్మ గారు, చిన్న అత్తయ్య గారు కలిసి ఇలా రెడీ చేసారని కావ్య చెప్తుంది. ఆ తర్వాత కావ్య తీసుకొని వచ్చిన పాలు రాజ్ తాగుతాడు.
మరొక వైపు అనామిక ఫోటో చూస్తూ కళ్యాణ్ మాట్లాడుకుంటాడు. నన్ను మీ ఇంట్లోకీ తీసుకొని వెళ్ళి, మీ వాళ్ళకి పరిచయం చేసావ్. నేనంటే ఎంత అభిమానమని అనుకుంటాడు. ఆ తర్వాత అప్పుకి కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడాలని అంటాడు. అప్పుడే కళ్యాణ్ కి అనామిక ఫోన్ చేస్తుంది. నేను మళ్ళీ చేస్తానని అప్పు ఫోన్ కట్ చేసి అనామికతో మాట్లాడుతాడు కళ్యాణ్. ఆ తర్వాత అప్పు ఎన్ని సార్లు ఫోన్ చేసిన కళ్యాణ్ ఫోన్ వెయిటింగ్ వస్తూనే ఉంటుంది. దాంతో అప్పుకి కోపం వస్తుంది. మరొక వైపు ఊళ్ళో లేరని చెప్పిన రాహుల్ కనకంకి కన్పిస్తాడు. దాంతో రుద్రాణికి కనకం ఫోన్ చేసి హనీమున్ కి వెళ్ళారని అన్నారు కదా? నాకు రాహుల్ కన్పించాడు అని రుద్రాణికి కనకం చెప్తుంది. కనకం ఆ విషయం ఇంట్లో అందరికి చెప్పేస్తుందేమోనని అనుకొని డైవర్ట్ చేస్తుంది రుద్రాణి. మీ కూతురు మీతో మాట్లాడడం లేదా? ఊరు వెళ్లినట్టు చెప్పలేదా అని రుద్రాణి అనగానే.. చెప్పలేదు. అంటే ఎక్కడ తక్కువ అయిపోతానో అనుకొని చెప్పిందని కనకం అంటుంది. తనకు కన్పించింది రాహుల్ కాదని కనకం కూడా రుద్రాణి మాటలు నమ్మేస్తుంది. ఆ తర్వాత రాహుల్ కి రుద్రాణి ఫోన్ చేసి మనం అనుకున్నది జరిగే వరకు జాగ్రత్తగా ఉండమని రుద్రాణి చెప్తుంది.
మరొక వైపు కావ్య కృష్ణస్టామి సందర్బంగా కృష్ణుడికి పూజ చేస్తుంది. పూజ చేసి హారతి అందరికి ఇస్తుంది. ఇంట్లో రోజు పూజ చేస్తారుగా, ప్రతి దానిని ఇలా అట్టహాసంగా చెయ్యడం ఎందుకని రుద్రాణి అనగానే.. రుద్రాణిపై ఇందిరాదేవీ కోప్పడుతుంది. ఇలా పూజలు చేస్తుంటేనే అందరం ఒక దగ్గరికి వస్తాం. నీకు ఇష్టం లేకుంటే నువ్వు నీ గదిలో నుండి రాకని ఇందిరాదేవి అంటుంది. రాజ్ కూడా రుద్రాణిని అలాగే అంటాడు. మరొకవైపు కనకం కూడా ఇంట్లో కృష్ణుడికి పూజ చేస్తుంది. ఆ తర్వాత అప్పు ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతుంటుంది. అప్పు మాట్లాడిన తీరు చూసి ఎవరితోనో గొడవ పెట్టుకోవడానికి వెళ్తుందని కనకంకి అర్థం అవుతుంది. దాంతో అప్పు వెళ్లకుండా గదిలో ఉంచి.. బయట గడియ పెడుతుంది. అప్పు తియ్యమన్న కూడా కనకం డోర్ తియ్యదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |